Title Picture
అశోక్ కుమార్, నిషీ

శంకర్ మూవీస్ వారి 'డార్క్ స్ట్రీట్' హిందీ డిటెక్టివ్ చిత్రం. తెలుగులో ఈనాడు లారీల కొద్దీ ఉత్పత్తి అవుతూ, తెలుగు పాఠకుల, ప్రేక్షకుల ఆదరాభిమానాలకు గురి అవుతున్న డిటెక్టివ్ నవలలకు నకలుగా ఉంది ఈ చిత్రం. ఈ 'అపరాధపరిశోధన' తెలుగులో చలన చిత్రాలకు వ్యాపించకుండా, కేవలం సాహిత్యానికే పరిమితమై ఉండడం మన అదృష్టం. పాపం హిందీ, తమిళ రంగాలలో ఈ అపరాధ పరిశోధన... చలన చిత్రాలకూ, సాహిత్యానికీ కూడా పట్టింది.

'స్కేప్ గోట్' అనే ఉత్తమ హాలీవుడ్ చిత్రాన్ని మనస్సులో ఉంచుకుని ఈ చిత్రాన్ని నిర్మించారట (దర్శక, నిర్మాతల ఆదర్శం ఉన్నతమైనదే). అశోక్ కుమార్ నటన ఈ చిత్రానికి ఏకైక ఆకర్షణ. మిగతా హంగులలో దత్తారాం సంగీతం కొంత చెప్పుకోతగ్గ విధంగా ఉంది.

నిర్మాత: రాజ్ కోహ్లీ; దర్శకుడు: నరేష్ సైగల్; సంగీతం: దత్తారాం; రచన: ఉమేష్ మధుర్; తారాగణం: అశోక్ కుమార్, నిషీ, కె.ఎన్.సింగ్, అనూప్ కుమార్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post