నండూరి ఆన్ లైన్ గురించి

'రసమయి' పత్రికను నేను 2000వ సంవత్సరం అక్టోబరులో దీపావళి పండుగ నాడు ప్రారంభించాను. 95 సంచికలు వెలువరించి చివరికి 2009వ సంవత్సరం ఏప్రిల్ లో ప్రచురణను ఆపివేశాను. వాటిలో 91 సంచికలను మాస పత్రికగాను చివరి నాలుగు సంచికలను త్రైమాసిక పత్రికగాను వెలువరించాను. అసలు ఆ పత్రికను ఎందుకు ప్రారంభించాను? చివరికి ఎందుకు నిలిపివేశాను? ఈ ప్రశ్నలకు సమాధానాలను చివరి సంచిక సరసోక్తి (సంపాదకీయం)లో చాలా వివరంగా చెప్పాను. ముందు ఆ వివరాలన్నీ 'ఉద్యాపన' లో చదివిన తర్వాత ఈ 'నండూరి ఆన్ లైన్' లోకి ప్రవేశించండి.
'రసమయి' లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి. అదనంగా ఇంకా చాలా అందాలు, ఆకర్షణలు, విశేషాలు ఉంటాయి. నండూరి ఆన్ లైన్ లో నా రచనలు, నా కుమారుడు డాక్టర్. నండూరి మధుసారథి సితార్ వాదనం ఉంటాయి. కొద్ది రచనలు మా అన్నయ్య డాక్టర్. నండూరి రామమోహన రావు గారివి-ఇంతకు ముందు ప్రచురితం కానివి-ఉంటాయి.
- నండూరి పార్థసారథి


Featured Content

NamPaaSaa's unpublished autobiography (serialized periodically)

New Articles

Books

Nampaasaa's books, children's books and Rasamayi cultural monthly.

Music

Dr. Madhu Nanduri's music and other seminal productions.