Title Picture

రేఖా చిత్రావారి 'ఖిలాడి' హిందీ చిత్రం అక్టోబరు 26వ తేదీన విడుదల అయింది. ఈ చిత్రంలో క్తతి యుద్ధాలూ, గుర్రపు స్వారీలూ, జెమినీ సర్కస్సూ ఉన్నాయి. నాయకుడుగా రంజన్ చక్కగా చేశాడు. అతను ఇందులో ఒకే పోలికలు కల ఇద్దరబ్బాయిల వేషాలు వేశాడు. నాయికగా జబీన్ నటించింది. నర్తకిగా నటించిన నూతన తార షకీలాబానో భోపాలీ (స్వంతంగా) పాడిన కవ్వాలీ పాటలు చాలా చక్కగా ఉన్నాయి. దుష్టుడుగా తివారీ, బఫూన్ గా సుందర్, అతని ప్రేయసిగా షమ్మీ నటించారు. సంగీతం శార్దూల్ క్వాత్రా సమకూర్చాడు. పాటలు ప్రేమ్ ధవన్ రచించాడు. నిర్మాత: ఎస్.దీక్షిత్; దర్శకుడు: ప్రమోద్ చక్రవర్తి.

వేడుక కోసం, తమాషా కోసం ఒక సారి చూడతగ్గ చిత్రం ఖిలాడి.

నండూరి పార్థసారథి
(1961 అక్టోబర్ 29వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post